- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) పురులియా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road accident) చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం నమ్షోల్ వద్ద బాలారంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 18పై లారీని బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. అడబానా గ్రామం నుంచి జార్ఖండ్‌లోని తిలైతాండ్ వైపు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బొలెరో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జవ్వగా, అందులో ప్రయాణిస్తున్న 9 మంది ప్రయాణికులు మృతిచెందారు. మృతులు వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ విషాదకర ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారాణంగా పోలీసులు భావిస్తున్నారు.






