- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుజరాత్‌లో వరుస భూకంపాలు
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో వరుస భూకంపాలు చోటుచేసుకున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: గుజరాత్‌ను (Gujarat) వరుస భూకంపాలు వణించాయి. కచ్ (Kutch) జిల్లాలో గురువారం రాత్రి 10:12 గంటల సమయంలో భూప్రకంనాలు (Earthquake) చోటుచేసుకున్నాయి. రికార్డు స్కేలుపై దీని తీవ్రత 3.4గా నమోదవ్వగా, 7 నిమిషాల వ్యవధిలోనే 2.7 తీవ్రతతో మళ్లీ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇక తొలి భూకంప కేంద్రం భచాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా, రెండవది రాపార్‌కు 19 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఇన్ స్టిట్యూట్ ఆప్ సీస్మొలాజికల్ రీసెర్చ్ (ISR) వెల్లడించింది. ఇక ఈ వరుస భూకంపాల వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరుగలేదని జిల్లా అధికార యంత్రాంగం తెలిపింది. కాగా, కచ్ అత్యంత ప్రమాదకర భూకంప జోన్‌లో ఉంది.
Next Story






