Shocking incident: బైక్‌పైకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. కారు రావడంతో!?(వీడియో)

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-19 11:57:35  IST  )

రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది

Shocking incident: బైక్‌పైకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. కారు రావడంతో!?(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరు(Bengaluru)లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. బెంగళూరులో వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని ఓ రోడ్డు పై ట్రాఫిక్ సిగ్నల్ కోసం ద్విచక్రవాహనం(Bike)పై ఓ వ్యక్తి వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో అటువైపుగా ఓ స్కూల్ బస్సు(School Bus) వేగంగా దూసుకొస్తోంది. ఈ తరుణంలో వేచి చూస్తున్న బైక్ పైకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. ఈ క్రమంలో బైకర్‌ను తొక్కకుంటూ ముందుకు వెళ్లిన స్కూల్ బస్సు మరో కారు(Car)ను ఢీకొట్టింది. అయితే ఈ షాకింగ్ రోడ్డు ప్రమాదం(Road Accident) పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అవుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Next Story