Robot : పంట తెగుళ్ళను గుర్తించే రోబో.. ఐఐటీ ఖరగ్‌పూర్ ఘనత

by Muthe.Rajitha |

పంటల్లో తెగుళ్లు, చీడ పీడలను గుర్తించే రోబో(Robot)ను ఐఐటీ ఖరగ్‌పూర్(IIT Kharagpur) తయారు చేసింది.

Robot : పంట తెగుళ్ళను గుర్తించే రోబో.. ఐఐటీ ఖరగ్‌పూర్ ఘనత
X

దిశ, వెబ్ డెస్క్ : పంటల్లో తెగుళ్లు, చీడ పీడలను గుర్తించే రోబో(Robot)ను ఐఐటీ ఖరగ్‌పూర్(IIT Kharagpur) తయారు చేసింది. ఐఐటీ ఖరగ్‌పూర్ లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పంట తెగుళ్ళను గుర్తించి పురుగు మందులు చల్లే సెమీ-ఆటోమేటిక్ ట్రాక్డ్ మొబైల్ మానిప్యులేటర్ రోబో(Robot)ను అభివృద్ధి చేసింది. ప్రొఫెసర్ దిలీప్ కుమార్ ప్రతిహార్ నేతృత్వంలో ప్రదీప్ నాహక్ తదితర విద్యార్థుల బృందం ఈ రోబోను రూపొందించింది. వీరు దీనికి పేటెంట్ ను కూడా పొందారు. ఈ రోబో.. ట్రాక్డ్ వాహనంపై సీరియల్ మానిప్యులేటర్‌తో రూపొందించబడింది. కెమెరా ఆధారిత ఇమేజ్ అనాలిసిస్ ద్వారా పంటల్లో తెగుళ్ళను గుర్తిస్తుంది. అందుకు తగిన పెస్టీసైడ్ ను ఎంచుకొని చల్లుతుంది. నిమిషానికి 3 మీటర్ల వ్యవసాయ భూమిని కవర్ చేస్తుంది. పురుగు మందులు పిచికారి చేసే రైతులు అనారోగ్యం పాలవకుండా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ప్రొఫెసర్ బృందం పేర్కొంది. అలాగే పంట నష్టాన్ని నివారించి, దిగుబడిని పెంచుతుంది. ఈ ప్రాజెక్ట్‌కు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చగా.. TECHNIDO సంస్థ తయారు చేసింది.

Next Story