- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యక్తిని కాటేయగానే చనిపోయిన విషపూరిత పాము.. కారణం ఏంటంటే?
సాధారణంగా పాములు కాటేస్తే తొందరగా ప్రథమ చికిత్స చేసి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

X
దిశ,వెబ్‌డెస్క్: సాధారణంగా పాములు కాటేస్తే తొందరగా ప్రథమ చికిత్స చేసి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తుంటారు. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇక, కొన్నిసార్లు విషపూరిత పాములు కాటేస్తే ఆ వ్యక్తి బతకడం కష్టమనే చెబుతుంటారు. కానీ, మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ ఖుద్సోడిలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సచిన్ అనే యువకుడిని విషపూరిత పాము కాటేసిన అతనికి ఏం కాలేదు. అంతేకాదు అతన్ని కాటేసిన విషపూరిత పాము అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన ఆశ్చర్యానికి గురిచేసిన.. ఇది చాలా అరుదైన ఘటనని బలంగా కాటేసినప్పుడు పాము కోరల పై ఒత్తిడి ప్రభావంతో అది మరణించవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఈ ఘటన పై సచిన్ స్పందిస్తూ.. పలు ఔషధ మూలికలతో పళ్లు తోముకుంటానని రక్తంలో ఔషధాలు మిళితమై ఉన్నందునే ఇలా జరిగొండచ్చని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
Next Story






