Breaking News : లాటరీలో కోటిన్నర గెలుచుకున్న ప్లంబ్లర్

by Muthe.Rajitha |

ప్లంబింగ్‌ పని చేసే వ్యక్తి లాటరీ(Lottery)లో రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు.

Breaking News : లాటరీలో కోటిన్నర గెలుచుకున్న ప్లంబ్లర్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్లంబింగ్‌ పని చేసే వ్యక్తి లాటరీ(Lottery)లో రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. హర్యానా(Haryana)లోని సిర్సాలో ఖైర్‌పూర్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న మంగళ్ అనే వ్యక్తి ప్లంబింగ్‌ పనులు చేస్తుంటాడు. అతడు గత ఐదేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. ఇటీవల కొనుగోలు చేసిన లాటరీలో రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు. మంగళవారం రాత్రి ఈ విషయం అతడికి తెలిసింది. దీంతో మంగళ్‌ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. ఇరుగు పొరుగువారితో కలిసి స్వీట్లు పంచుకుని ఆనందాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. మరోవైపు లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో తొలుత సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటానని, తన కుమార్తె భవిష్యత్తు కోసం మిగతా డబ్బును సేవ్‌ చేస్తానని మీడియాకు తెలిపాడు.

Next Story