భారత సరిహద్దులో కలకలం.. అనుమానాస్పద బ్యాగ్ జారవిడిన పాక్ డ్రోన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-01 12:32:33  IST  )

న్యూ ఇయర్ వేళ భారత సరిహద్దు ఫూంచ్‌లో ఒక్కసారిగా పాకిస్థాన్ డ్రోన్ కలకలం రేపింది..

భారత సరిహద్దులో కలకలం.. అనుమానాస్పద బ్యాగ్ జారవిడిన పాక్ డ్రోన్
X

దిశ, వెబ్ డెస్క్: న్యూ ఇయర్ వేళ భారత సరిహద్దు ఫూంచ్‌(Indian Border Poonch)లో ఒక్కసారిగా పాకిస్థాన్ డ్రోన్(Drone) కలకలం రేపింది. అవతలి వైపు నుంచి డ్రోన్ అనుమానాస్పద బ్యాగును జారవిడిచి వెళ్లింది. దీంతో భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఖాదీ- ఖర్బదా(Khadi- Kharbada) ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. ఈ మేరకు బ్యాగును పరిశీలించారు. డ్రగ్స్‌తో పాటు పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. సరిహద్దులో డ్రోన్(Done) చక్కర్లు కొట్టడంపై దర్యాప్తు చేస్తున్నారు. భారత సరిహద్దులో డ్రగ్స్(Drugs), పేలుడు పదార్థాలు(Explosives) ఎవరికి సరఫరా చేస్తున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకూ ఇలా ఎన్ని సార్లు డ్రోన్లు సరిహద్దులోకి వచ్చాయనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

ఉగ్రవాద సంస్థల కుట్రలపై నిఘా

చలికాలం కావడం, మంచుకురుస్తున్న వేళ కొన్ని ఉగ్రవాద సంస్థలు డ్రోన్ల ద్వారా ఆయుధాలు జారవిడుస్తున్నట్లు ఇప్పటికే ఉన్న సమాచారంతో భద్రత బలగాలు సరిహద్దులో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రోన్ నుంచి బ్యాగు కింద పడటంతో వెంటనే అప్రమత్తమయి స్వాధీనం చేసుకున్నారు. ఐదు నిమిషాలు పాటు డ్రోన్ చక్కర్లు కొట్టినట్లు గుర్తించారు. పూంచ్ సెక్టార్‌తో పాటు జమ్మూకాశ్మీర్ సరిహద్దులో పూర్తి స్థాయిలో భద్రత బలగాలు జల్లెడపడుతున్నాయి.

Next Story