తమిళ రాజకీయాల్లో కొత్త పార్టీ.. డైరెక్ట్ జెండాతో దిగిన శశికళ

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-24 14:29:45  IST  )

అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ కొత్త పార్టీ ప్రకటించారు.

తమిళ రాజకీయాల్లో కొత్త పార్టీ.. డైరెక్ట్ జెండాతో దిగిన శశికళ
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ కొత్త పార్టీ(Sasikala New Party) ప్రకటించారు. నూతన జెండాను సైతం మంగళవారం ఆవిష్కరించారు. శశికళ పార్టీ జెండా తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లో డిజైన్ చేశారు. జెండాలో జయలలిత, అన్నాదురై, ఎంజీఆర్ ఫొటోలు ముద్రించారు. అయితే.. పార్టీ పేరును మాత్రం ప్రకటించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ.. పార్టీ పేరును త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. తమిళనాడు రాజకీయాల్లో నా మార్క్ చూపిస్తా అని ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. జయలలితకు మూడు దశాబ్దాలకు పైగా అత్యంత సన్నిహితురాలిగా ఉన్న శశికళ, ఆమె పాలనలో తెరవెనుక శక్తిమంతమైన వ్యక్తిగా కొనసాగారు. 2016 డిసెంబర్‌లో జయలలిత మరణానంతరం క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అనంతరం కొన్ని పరిస్థితుల కారణంగా జైలు జీవితం గడిపారు. 2021లో జైలు నుంచి విడుదలయ్యే సమయానికి అన్నాడీఎంకేలో శశికళను పూర్తిగా పక్కనపెట్టారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీతో బరిలోకి వస్తానని ప్రకటించారు. నేడు ఏకంగా కొత్త పార్టీనే ప్రకటించారు. దీంతో ఆమెను తమిళ ప్రజలు ఆదరిస్తారో లేదో చూడాలి.

Next Story