- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పేస్ రంగంలో నవ శకం.. దేశంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగం
"హైదరాబాద్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' రూపొందించిన దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' శ్రీహరికోట నుంచి ప్రయోగానికి సిద్ధమైంది.

దిశ, వెబ్‌డెస్క్: భారత అంతరిక్ష రంగ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడనుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ (Skyroot Aerospace) వారు రూపొందించిన దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 (Vikram-1) ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని శనివారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) నుంచి చేపట్టనున్నారు.
‘విక్రమ్-1’ రాకెట్ ప్రత్యేకతలు ఇవే..
ఈ రాకెట్ బాడీని పూర్తిగా కార్బన్ ఫైబర్ నానో-కంపోజిట్ మెటీరియల్‌తో అత్యంత పటిష్టంగా, తక్కువ బరువుతో డిజైన్ చేశారు. రాకెట్‌లోని అత్యాధునిక ద్రవ ఇంధన ఆధారిత ఇంజన్లను అత్యాధునిక 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో స్కైరూట్ స్వయంగా అభివృద్ధి చేసింది. ఈ రాకెట్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ క్లయింట్లకు చెందిన పలు చిన్న ఉపగ్రహాలను లో-ఎర్త్ ఆర్బిట్ (LEO) కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఖర్చును తగ్గించడంతో పాటు, ఉపగ్రహాలను వేగంగా కక్ష్యలోకి చేర్చేందుకు వీలుగా విక్రమ్-1 రాకెట్‌ను రూపొందించినట్లుగా స్కైరూట్ ఏరోస్పేస్ సహ-వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన తెలిపారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. అంతర్జాతీయ వాణిజ్య అంతరిక్ష విపణిలో భారత్ స్థానం మరింత బలోపేతం కానుంది.






