- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర: రూ.3.25 లక్షల కోట్లతో 114 రాఫెల్ జెట్ల కొనుగోలు
భారత రక్షణ శాఖ మరో సరికొత్త రికార్డు సృష్టించింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత వైమానిక దళం (IAF) బలాన్ని మరింత పటిష్టం చేసేలా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. సుమారు రూ.3.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 114 మల్టీ-రోల్ యుద్ధ విమానాలను (MRFA) కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వానికి భారత్ అధికారికంగా ‘లెటర్ ఆఫ్ రిక్వెస్ట్’ (LoR) జారీ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ ఒప్పందాలలో ఒకటిగా ఇది నిలవనుంది.
‘మేక్ ఇన్ ఇండియా’ కింద 94 యుద్ధ విమానాలు
ఈ మెగా డీల్‌లో భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ విధానాన్ని దీనికి వర్తింపజేసింది. ఒప్పందంలో భాగంగా మొదటి 20 రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్‌లోని దస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి నేరుగా భారత్‌కు రానున్నాయి. మిగిలిన 94 రాఫెల్ జెట్లను భారతీయ వ్యూహాత్మక భాగస్వామ్య సంస్థ (Strategic Partner) సహకారంతో పూర్తిస్థాయిలో భారతదేశంలోనే తయారీ (Manufacture) చేయనున్నారు. భారత వైమానిక దళంలో ప్రస్తుతం ఉన్న పాత తరం ఫైటర్ జెట్ల స్థానాన్ని భర్తీ చేయడానికి, చైనా-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఒకేసారి రెండు సవాళ్లను (Two-front war scenario) ఎదుర్కోవడానికి 4.5 జనరేషన్‌కు చెందిన ఈ రాఫెల్ జెట్లు అత్యంత కీలకం కానున్నాయి.






