'కన్న బిడ్డ కన్నా దేశమే గొప్ప'.. ఆర్మీ ఉద్యోగిని వీడియో వైరల్

by Disha Web Desk 13 |
కన్న బిడ్డ కన్నా దేశమే గొప్ప.. ఆర్మీ ఉద్యోగిని వీడియో వైరల్
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: భారత్​ఆర్మీలో ఆమె సభ్యురాలు. పదినెలల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అంతలోనే డ్యూటీలో చేరాలంటూ సరిహద్దుల నుంచి పిలుపు. కన్నబిడ్డ కన్నా దేశానికే ప్రాధన్యతనిచ్చిన ఆ తల్లి పుట్టిన శిశువును అత్తామామల చేతుల్లో పెట్టి విధుల నిర్వర్తనకు బయల్దేరి వెళ్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​అవుతోంది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన వర్షాపాటిల్​భారత సైన్యంలో విధులు నిర్వర్తిస్తోంది. గర్భం దాల్చిన నేపథ్యంలో సెలవులు తీసుకుని ఇంటికి వచ్చిన ఆమె పది నెలల క్రితం బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఉన్నతాధికారుల నుంచి విధుల్లో చేరాలన్న ఉత్తర్వులు రాగానే క్షణం ఆలోచించకుండా డ్యూటీకి బయల్దేరింది. రైల్వేస్టేషన్‌లో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ బిడ్డను అత్తామామల చేతుల్లో పెట్టి దేశ సేవకై బయల్దేరి వెళ్లిపోయింది.

Next Story

Most Viewed