అయోధ్యలో అద్భుతం ఆవిష్కృతం.. రామ్‌లాల్లా నుదుటిపై సూర్య తిలకం ప్రత్యక్షం

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-27 06:51:29  IST  )

అయోధ్య రామ మందిరంలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా, భక్తుల రామనామ జయజయధ్వానాల మధ్య కొనసాగుతున్నాయి.

అయోధ్యలో అద్భుతం ఆవిష్కృతం.. రామ్‌లాల్లా నుదుటిపై సూర్య తిలకం ప్రత్యక్షం
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామమందిరంలో శ్రీరామనవమి వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీరామనవమి పర్వదినాన అత్యంత కీలకమైన ‘సూర్య తిలకం’ ఘట్టం సరిగ్గా మధ్యా్హ్నం 12 గంటలకు ఆవిష్కృతమైంది. దాదాపు 4 నిమిషాల పాటు రామ్ లల్లా విగ్రహం నుదుటన తిలకంలా సూర్యకిరణాలు పడటంతో భక్తులు ఆనందంతో పరవశింపోయారు.

మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ట్రస్ట్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ స్లాట్లలో దర్శనాలకు అనుమతిస్తున్నారు. తెల్లవారుజామున 4.30కి గంటలకు మంగళ హారతి క్రతువు ముగియగా, రాత్రి 9.30కి శయన ఆరతి నిర్వహించనున్నారు.. రామనవమి సందర్భంగా అయోధ్యకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం నగరం అంతటా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి సూర్య తిలకం, ప్రధాన పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఆలయ ట్రస్ట్ సూచనల ప్రకారం.. భక్తులు తమ దర్శన సమయాలను ముందుగానే చెక్ చేసుకుని, ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Next Story