- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెక్స్‌లో పాల్గొన్న మైనర్లు.. అధిక రక్తస్రావంతో మృతి..
బీహార్ పాట్నాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. జెహానాబాద్‌కు చెందిన మైనర్ బాలిక తన స్నేహితుడిగా భావించిన మరో మైనర్ బాలుడితో సెక్స్ చేస్తున్న సమయంలో అధిక రక్తస్రావం కారణంగా మరణించింది. వీరిద్దరూ పది రోజుల క్రితం జెహానాబాద్

దిశ, వెబ్ డెస్క్: బీహార్ పాట్నాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. జెహానాబాద్‌కు చెందిన మైనర్ బాలిక తన స్నేహితుడిగా భావించిన మరో మైనర్ బాలుడితో సెక్స్ చేస్తున్న సమయంలో అధిక రక్తస్రావం కారణంగా మరణించింది. వీరిద్దరూ పది రోజుల క్రితం జెహానాబాద్ రైల్వే స్టేషన్‌లో కలుసుకున్నారు. బాలుడు ఆమెను జక్కన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్బిగాహియా ప్రాంతంలో ఉన్న స్నేహితుడి గదికి రమ్మని కోరాడు. అయితే లైంగిక సంబంధం సమయంలో బాలికకు తీవ్ర రక్తస్రావం అయింది. ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMCH)కి రిఫర్ చేయగా.. చికిత్స పొందుతూ చనిపోయింది.
బాలుడు, అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. విచారణ కొనసాగుతోంది. స్టేట్‌మెంట్లు నమోదు చేసిన తర్వాత ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయనున్నారు. ఇక బాలిక తాత ఆమె 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నట్లు, పాట్నాకు వెళ్లిన విషయం కుటుంబానికి తెలియదని చెప్పాడు.






