- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పగబట్టిన విధి.. పెళ్లైన తెల్లారే కొత్త జంటను కబలించిన మృత్యువు
పెళ్లి బాజాలు మోగిన ఇంట్లో చావు డప్పులు వినిపించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: విధి పగసాధించిందా అన్నట్లుగా ఓ జంటను కాళ్ల పారాణి ఆరకముందే ఊహించని రీతిలో మృత్యువు కబలించింది. పెళ్లైన మరుసటి రోజే వధూవరులు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో అందరిని కంటతడి పెట్టిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో జరిగిన ఈ విషాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వీరేంద్ర శాక్య (25) అనే యువకుడికి రాజేశ్వరి అనే యువతితో శనివారం ఒక ఆలయంలో ఘనంగా వివాహం జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ జంట గుడిలో పూజలు ముగించుకుని గత ఆదివారం వరుడి తల్లి అన్వేష్ శాక్య (50), వదిన రాజో శాక్య (22) సోదరి భూరియా శాక్యతో కలిసి ఆటోలో తమ స్వగ్రామానికి బయలుదేరారు.
లారీ రూపంలో మృత్యువు:
మార్గమధ్యలో ఆటో డ్రైవర్ ఓ క్రాస్ రోడ్డు వద్ద పక్కన ఆటోను ఆపి దుకాణానికి వెళ్లాడు. ఆ సమయంలో కోళ్ల దాణా బస్తాలతో ఓ లారీ ఆటో ఉన్న వైపు టర్న్ అయేందుకు ప్రయత్నించింది. అక్కడ కాస్త డౌన్ ఉండటంతో భారీ లోడ్ తో ఉన్న లారీ అదుపుతప్పి ఆటోపై బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఆటో నుజ్జు నుజ్జు కాగా ఆటోలో కూర్చున్న వధువు, వరుడు, వారి కుటుంబ సభ్యులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వరుడి సోదరి భూరియా శాక్య, ఆటో డ్రైవర్ డ్రైవర్ ఆ సమయంలో బయట ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన భయంకరమైన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పెళ్లి బాజాలు మోగిన ఇంట్లో చావు డప్పులు వినిపించడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల రోధనలతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.






