ప్రముఖ ఆలయ ప్రాంగణంలో శవాల గుట్టలు.. 20ఏళ్లుగా అత్యాచారం, హత్యలు.. తవ్వేకొద్దీ..(లింక్)

by Sujitha Rachapalli |

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి తాలూకాలో నెత్రావతి నదీ తీరంలో ఉన్న ప్రసిద్ధ ధర్మస్థల ఆలయంలో 20ఏళ్లుగా దారుణాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అత్యాచారం

ప్రముఖ ఆలయ ప్రాంగణంలో శవాల గుట్టలు.. 20ఏళ్లుగా అత్యాచారం, హత్యలు.. తవ్వేకొద్దీ..(లింక్)
X

దిశ, వెబ్‌ డెస్క్: కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి తాలూకాలో నెత్రావతి నదీ తీరంలో ఉన్న ప్రసిద్ధ ధర్మస్థల ఆలయంలో 20ఏళ్లుగా దారుణాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అత్యాచారం, హత్య చేస్తూ మృతదేహాలను పాతిపెట్టడం, కాల్చడం జరుగుతోందని మాజీ సానిటేషన్ కార్మికుడు సంచలన ఆరోపణలు చేశాడు. పవర్ ఫుల్ వ్యక్తుల ఆదేశాల మేరకు ఈ పనులు చేసినట్లు పేర్కొన్నాడు. ఇందులో మైనర్ బాలికలతో సహా అనేక మంది బాధితులు ఉన్నారని ఆరోపించాడు.

ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఇటీవల ఓ మృతదేహాన్ని తవ్వి బయటకు తీసినట్లు సమాచారం. కాగా ఈ చర్య ఆలయంలో జరిగిన దుష్కర్మలకు ఆధారంగా చూపబడింది. శానిటేషన్ కార్మికుడు ధర్మస్థల పోలీసులు, దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా .. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా తన జీవితానికి ముప్పు ఉందని భావించి, ఈ మాజీ కార్మికుడు పోలీసు రక్షణ కోరాడు. 2014లో ఈ ఘటనల నుంచి తప్పించుకుని పారిపోయిన అతను.. ఇటీవల తిరిగి వచ్చి ఈ ఆరోపణలను బహిర్గతం చేశాడు.

ధర్మస్థల ఆలయం ప్రత్యేకత..

ధర్మస్థల ఆలయం కర్ణాటకలోని ఒక ప్రసిద్ధ హిందూ ఆలయం. ఇది మంజునాథేశ్వర (శివుడు), అమ్మనవరు, చంద్రనాథ, ధర్మదైవాలైన కలరాహు, కలర్కాయి, కుమారస్వామి, కన్యాకుమారి వంటి దేవతలు కొలువైన గుడి. జైనుల పరిపాలనలో ఉండటం.. హిందూ పూజారులచే వైష్ణవ సిద్ధాంతాల ప్రకారం పూజలు నిర్వహించబడటం దీని ప్రత్యేకత. రోజుకు సగటున 10,000 మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. లక్షదీపాల ఉత్సవం వంటి కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది. ఆలయం సామాజిక సేవా కార్యక్రమాలు, ఉచిత సామూహిక వివాహాలు, మొబైల్ హాస్పిటల్ సేవలు, క్షయవ్యాధి చికిత్సా కేంద్రాలను నిర్వహిస్తుంది.

LINK

Next Story