- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుర్కా ధరించి మహిళల బోగీలోకి ప్రవేశించిన కామాంధుడు
మహారాష్ట్రలోని ముంబై లోకల్ ట్రైన్ లో ఓ దుర్మార్గుడు దారుణానికి ఒడిగట్టాడు. ముస్లింలు ధరించే బుర్కా వేసుకొని, రచ్చ రచ్చ చేశాడు.

దిశ, వెబ్ డెస్: దేశంలో రోజుకో దారుణం జరుగుతోంది. కొంతమంది దుర్మార్గులు కామ వాంఛతో రెచ్చిపోతున్నారు. మహిళలను వేధించేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎక్కడ ఛాన్స్ దొరికినా వదలడం లేదు. అయితే తాజాగా ఓ దుర్మార్గుడు మహిళలను అసభ్యంగా టచ్ చేసేందుకు, సినిమా రేంజ్ లో ప్లాన్ చేశాడు. బుర్కా ( Burqa) వేసుకొని, లేడీస్ లోకల్ బోగి ఎక్కాడు. ఆ తర్వాత మహిళలను చెప్పరానిచోట తాకి, అసభ్యంగా ( molest women passengers) ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ముంబై లోకల్ ట్రైన్ లో ( Mumbai local train) జరిగింది.
ముంబై లోకల్ ట్రైన్ లో దారుణం
మహారాష్ట్రలోని ముంబై లోకల్ ట్రైన్ లో ఓ దుర్మార్గుడు దారుణానికి ఒడిగట్టాడు. ముస్లింలు ధరించే బుర్కా వేసుకొని, రచ్చ రచ్చ చేశాడు. బుర్కా వేసుకొని లేడీ బోగి ఎక్కాడు. ఆ తర్వాత అమ్మాయిలను అసభ్యంగా టచ్ చేస్తూ, ఇబ్బంది పెట్టాడు. కొంత మందిని దారుణంగా వేధించినట్లు తెలుస్తోంది. అయితే ఆ బుర్కా గెటప్ లో ఉన్న వాడి ప్రవర్తన అనుమానంగా ఉండటం గమనించారు. అనంతరం మహిళలందరూ చుట్టు ముట్టి అసలు బండారం బయటపెట్టారు. ఇంతలోనే ట్రైన్ నుంచి జంప్ చేసి, పారిపోయాడట. ఆ తర్వాత ఘోట్కోపర్ ( Ghatkopar station) రైల్వే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నిందితుడి కోసం గాలింపు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.






