పెళ్లి ఒత్తిడి.. మర్మాంగం కోసుకున్న యువకుడు

by Sujitha Rachapalli |

బంగ్లాదేశ్ పబ్నాలోని మణిక్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోమని కుటుంబీకులు ఒత్తిడి చేయడంతో 22ఏళ్ల యువకుడు నజ్ముల్ హొస్సైన్ మర్మాంగాన్ని కత్తిరించుకున్నాడు. జూన్ 26న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది

పెళ్లి ఒత్తిడి.. మర్మాంగం కోసుకున్న యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ పబ్నాలోని మణిక్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోమని కుటుంబీకులు ఒత్తిడి చేయడంతో 22ఏళ్ల యువకుడు నజ్ముల్ హొస్సైన్ మర్మాంగాన్ని కత్తిరించుకున్నాడు. జూన్ 26న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వివాహం విషయంలో ఎక్స్‌కవేటర్ ఆపరేటర్ అయిన నజ్ముల్, కుటుంబం మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. దీంతో కోపంలో తన జననాంగాలను స్వయంగా కట్ చేసుకున్నట్లు సమాచారం. అతనికి ఇప్పటికే ఉన్న మానసిక ఆరోగ్య సమస్యల వల్ల ఇలా జరిగిందని తెలుస్తోంది.

మింటు మొల్లా కుమారుడైన నజ్ముల్‌కు ముగ్గురు అక్కాచెల్లెల్లు ఉన్నారు. వారిలో ఇద్దరు పెళ్లి కాలేదు. దీంతో అతనిపై వివాహ ఒత్తిడి మరింత పెరిగింది. ఈ సంఘటన తర్వాత అతని అరుపులు విన్న పొరుగువారు బెరా ఉపజిలా హెల్త్ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లారు. గాయాల తీవ్రత కారణంగా.. అతన్ని ఢాకా మెడికల్ కాలేజీకి శస్త్రచికిత్స కోసం తరలించారు. ఆ తర్వాత పబ్నా జనరల్ ఆసుపత్రికి బదిలీ చేయబడ్డాడు. అక్కడ అతను ప్రస్తుతం స్థిరంగా ఉన్నాడు. చికిత్స పొందుతున్నాడు. పబ్నా జనరల్ ఆసుపత్రిలోని రెసిడెంట్ ఫిజిషియన్ డాక్టర్ జహిదుల్ ఇస్లాం.. శస్త్రచికిత్స విజయవంతమైందని, నజ్ముల్ ఇప్పుడు బాగున్నాడని తెలిపాడు.

Next Story