- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mumbai: గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఘోర అగ్ని ప్రమాదం !
ముంబై గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదాల విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ , ఇతర చిన్న చిన్న కారణాలవల్ల ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే లేటెస్ట్ గా మహారాష్ట్రలోని ముంబైలో ఘోర అగ్నిప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దట్టమైన పొగలు వస్తున్న వీడియో కూడా వైరల్ గా మారింది.
ముంబైలో ఘోర అగ్ని పమాదం.. దట్టమైన పొగలతో
ముంబైలోని ( Mumbai) గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే అగ్ని ప్రమాదం జరిగిన స్థలం దగ్గర భారీగా పొగలు కూడా కమ్ముకుంటున్నాయి. గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. సరిగ్గా దక్షిణ ముంబైలోని లయన్ గేట్ సమీపంలోనే ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. దట్టమైన పొగలు కమ్ముకున్న నేపథ్యంలో స్థానికులు ఉలిక్కిపడుతున్నారు. కిలోమీటర్ల దూరం వరకు ఈ పొగ వ్యాపిస్తోందట.
అయితే ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారం అందడంతో రంగంలోకి ఫైర్ సిబ్బంది దిగింది. ఆ మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ అగ్ని ప్రమాదం జరిగిన కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎంత అయిందన్న దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. అధికారులు కూడా ఏ విషయాన్ని వెల్లడించలేదు. అయితే ఈ ( Mumbai) అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రమాద సంఘటన ముందు ఉన్న రోడ్లను బ్లాక్ చేశారు. ట్రాఫిక్ ను మరో దానికి మళ్లించారు. ఇక ఈ అన్ని ప్రమాద సంఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక అటు ఈ మధ్య కాలంలోనే మహారాష్ట్ర లో మరో అగ్ని ప్రమాదం (Fire Accident ) కూడా జరిగింది. రెండు రోజుల కిందట ఫిబ్రవరి 10వ తేదీన మంగళవారం రాత్రి పార్క్ చేసిన మూడు లక్షలు బస్సులో ఒకసారిగా మంటలు చెలరేగిన సంఘటన మహారాష్ట్ర లోని పూణే సమీపంలో జరిగింది. పూనే సమీపంలో ఉన్న పింప్రి చించ్ వాడ్ ప్రాంతంలోనే ఈ ప్రమాద సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఒక బస్సు పూర్తిగా దగ్ధమైంది. మరో రెండు బస్సులు పాక్షికంగా కాలి పోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ బస్సులు తగలపడిపోయాయని అధికారులు వెల్లడించారు. అయితే ఈ బస్సులు కాలిపోయిన సమయంలో ప్రయాణికులు ఎవరూ లేరు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఆ మూడు బస్సులు అగ్ని ప్రమాదం కారణంగా కాలి పోవడం వల్ల ఆస్తి నష్టం మాత్రం బాగానే జరిగింది. దాదాపు కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని అంటున్నారు.






