ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం

by velandi.Saikiran |   (  Updated:2026-05-23 01:21:02  IST  )

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ త‌రుణంలో ఫర్నీచర్ షాప్స్ దగ్ధమైయ్యాయి.

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. 45 డిగ్రీలకు పైగా ప్రతిరోజు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీలు దాటుతోంది. ఈ ఎండల తీవ్రత నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఘోర‌ అగ్ని ప్రమాదం నెలకొంది. ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న‌త‌రుణంలో ఫర్నీచర్ షాప్స్ దగ్ధమైయ్యాయి. శాస్త్రి పార్క్ ప్రాంతంలోని ఫర్నీచర్ మార్కెట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫర్నీచర్స్, ప్లైవుడ్ కారణంగా.. షాపులకు మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ పెను ప్ర‌మాదంలో భారీగా ఆస్తి నష్టం జ‌రిగింది. ప్రాణ న‌ష్టం జ‌రుగ‌లేద‌ని తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది. క్లిక్

Next Story