కేరళలో తప్పిన పెను ప్రమాదం.. కళ్ల ముందే మునిగిపోయిన ఫేమస్ హౌస్‌బోట్

by Ramesh Naini |

కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలో తృటిలో భారీ ప్రాణనష్టం తప్పింది. పర్యాటకులతో వెళ్తున్న ఒక హౌస్‌బోట్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కళ్ల ముందే నీటిలో మునిగిపోయింది.

కేరళలో తప్పిన పెను ప్రమాదం.. కళ్ల ముందే మునిగిపోయిన ఫేమస్ హౌస్‌బోట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలో తృటిలో భారీ ప్రాణనష్టం తప్పింది. పర్యాటకులతో వెళ్తున్న ఒక హౌస్‌బోట్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కళ్ల ముందే నీటిలో మునిగిపోయింది. అయితే, స్థానికుల సత్వర స్పందనతో అందులోని ప్రయాణికులంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కొల్లం జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన మన్‌రో దీవుల (Munroe Islands) వద్ద నిన్న ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అదే సమయంలో 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక హౌస్‌బోట్ ఒక్కసారిగా పాక్షికంగా నీటిలో మునిగిపోవడం ప్రారంభించింది. ఇది గమనించిన స్థానికులు, సమీపంలో పడవలు నడుపుకునే జాలర్లు వెంటనే అప్రమత్తమయ్యారు.

20 మంది పర్యాటకులు..

హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోటు పూర్తిగా మునిగి పోకముందే, అందులోని 20 మంది పర్యాటకులను సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షం, ఈదురు గాలుల ప్రభావంతో పాటు, బోటు అడుగు భాగం నుంచి ఒక్కసారిగా నీరు లోపలికి చొరబడటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, ఆ ప్రాంతంలో హౌస్‌బోట్‌లకు అంటే ఫేమస్ అయిన విషయం తెలిసిందే.

Next Story