Lottery Jack Pot : రూ.10 కోట్ల లాటరీ జాక్ పాట్ కొట్టిన లారీ డ్రైవర్

by Muthe.Rajitha |

ఓ లారీ డ్రైవర్(Lorry Driver) ఏకంగా రూ.10 కోట్ల జాక్ పాట్(Jock Pat) కొట్టాడు.

Lottery Jack Pot : రూ.10 కోట్ల లాటరీ జాక్ పాట్ కొట్టిన లారీ డ్రైవర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ లారీ డ్రైవర్(Lorry Driver) ఏకంగా రూ.10 కోట్ల జాక్ పాట్(Jock Pat) కొట్టాడు. లాటరీ(Lottory)లో భారీ మొత్తం గెలుచుకొని ఓవర్ నైట్ కోటీశ్వరుడు అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పంజాబ్(Panjab) రాష్ట్రానికి చెందిన హర్పిందర్ సింగ్(Harpinder Singh) అనే వ్యక్తి కువైట్ లో ట్రక్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తుంటాడు. సెలవులకు దేశానికి వచ్చిన అతను.. డియర్ లోహ్రి మకర సంక్రాంతి-2025(Dear Lohri Makara Sankranthi-2025) కి చెందిన లాటరీని రూ.500 పెట్టి కొనుగోలు చేశాడు. తాజాగా వెల్లడైన లాటరీ విజేతల్లో హర్పిందర్ సింగ్ ఏకంగా రూ.10 కోట్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. కాగా ఈ లాటరీ చరిత్రలో ఇంత పెద్ద అమౌంట్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి అని లాటరీ నిర్వాహకులు తెలియజేశారు. ఈ సంతోషకరమైన వార్తను బంధు మిత్రులతో పంచుకున్న సింగ్.. తాను గత 15 ఏళ్లుగా గ్రామానికి వచ్చిన ప్రతిసారి కొంటున్నానని, ఇక ఆ ఎడారి దేశంలో పగలు రాత్రి కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడే ఏదైనా వ్యాపారం చేసుకుంటానని వెల్లడించారు.

Next Story