- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వందల మంది అల్లరి మూకపై ఒంటరి మహిళ పోరాటం.. శివంగిలా తిరగబడిన వైనం!
బంగ్లాదేశ్‌లో అరాచక శక్తుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో అరాచక శక్తుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. చట్టం తన పని తాను చేయకముందే, మూకదాడులు ప్రాణాలు తీసే స్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఒక చిన్న అనుమానంతో వందలాది మంది ఒక ఇంటిపై దాడి చేయగా, ఆ ఇంటిని, తన బిడ్డను కాపాడుకునేందుకు ఓ మహిళ చూపిన ధైర్యం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆవును దొంగతనం చేశారనే ఒక చిన్న అనుమానంతో స్థానిక అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఎటువంటి విచారణ లేకుండానే కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో ఒక నివాసంపై దాడికి దిగారు.
శివంగిలా ఎదిరించిన మహిళ..
అయితే.. వందల సంఖ్యలో ఉన్న పురుషులు ఆ ఇంటిని చుట్టుముట్టి రాళ్లు విసురుతుండగా, లోపల ఉన్న కుటుంబ సభ్యులు ప్రాణభయంతో వణికిపోయారు. అయితే, అందరిలా భయపడి ఇంట్లో దాక్కుంటే తన బిడ్డకు, కుటుంబానికి ప్రమాదమని భావించిన ఆ ఇంటి మహిళ ఊహించని విధంగా స్పందించింది. చేతిలో ఒక కత్తి పట్టుకుని, మృత్యువు కళ్లముందు కనిపిస్తున్నా వెనకడుగు వేయకుండా బయటకు వచ్చింది. వందల మంది తనపైకి దూసుకొస్తున్నా, రాళ్లు పడుతున్నా లెక్కచేయకుండా వారిని ఎదిరించింది. ఒక 'శివంగి' లాగా గర్జిస్తూ తన ఇంటి గడప దాటనివ్వకుండా అల్లరి మూకను నిలువరించే ప్రయత్నం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఆ మహిళ తెగువ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఆమె ఒంటరిగా పోరాడుతుండటంతో ప్రాణహాని ఉందని గమనించిన కుటుంబ సభ్యులు, ఆమెను బలవంతంగా లోపలికి లాక్కెళ్లారు. ఆమె లోపలికి వెళ్లగానే ఆ ఉన్మాద మూక ఇంటిపై పడి కిటికీలు, తలుపులు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించింది.






