- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంగన్వాడీ మెనూనే మార్చబోతున్న చిన్న పిల్లాడి కోరిక.. వీడియో వైరల్
ఓ చిన్నారి కోరిక (child's wish) అంగన్వాడీ మెనూ (Anganwadi menu)నే మార్చేసిన ఆశ్చర్యకర ఘటన (surprising incident) కేరళ (Kerala)లో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: ఓ చిన్నారి కోరిక (child's wish) అంగన్వాడీ మెనూ (Anganwadi menu)నే మార్చేసిన ఆశ్చర్యకర ఘటన (surprising incident) కేరళ (Kerala)లో జరిగింది. కేరళలో ఓ తల్లి తన కుమారుడికి బిర్యానీ తినిపిస్తున్న సమయంలో పిల్లాడు ఓ చిన్ని కోరిక కోరాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ అవ్వడంతో కేరళ రాష్ట్రంలోని అంగన్వాడీ మెనూని మార్చే స్థితికి తీసుకొచ్చింది. ఈ వీడియోలో టోపి ధరించిన శంకు (Shanku) అనే పిల్లాడు అమాయకంగా తన తల్లిని.. "నాకు అంగన్వాడీలో ఉప్మా (upma)కు బదులు బిర్యానీ (biryani), చికెన్ ఫ్రై (chicken fry) కావాలి అని అడిగాడు.
ఆ చిట్టి పొట్టి మాటలను పిల్లాడి తల్లి చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త నెట్టంట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అంతేగాక ఆ పిల్లాడి అభ్యర్థనకు మద్దతు తెలుపుతూ.. తాము పిల్లాడికి బిర్యానీ, చికెన్ ఫ్రై ఆర్డర్ పెట్టడానికి రెఢీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ వైరల్ వీడియో కాస్త కేరళ రాష్ట్ర ఆరోగ్య, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ (Health, Women and Child Welfare Minister Veena George) వద్దకు చేరింది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న ఆమె.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు (interesting comments) చేశారు. శంకు అభ్యర్థన (Shanku's request)ను పరిగణలోకి తీసుకుంటున్నామని, మెనూని సమీక్షిస్తామని (reviewed) ఆమె అన్నారు. ఈ సందర్భంగా శంకు, అతని తల్లి, అంగన్‌వాడీ సిబ్బంది (Anganwadi staff)కి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పిల్లలకు పోషకాహారం భోజనం (nutritious meals) అందించడానికి అంగన్ వాడీల ద్వారా రకరకాల ఆహారాన్ని అందిస్తున్నామని, అంగన్ వాడీల ద్వారా గుడ్లు, పాలు (eggs and milk) అందించే పథకం విజయవంతంగా అమలు చేయబడిందని చెప్పారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ సమన్వయంతో అంగన్ వాడీలలో వివిధ రకాల ఆహారాలను అందిస్తున్నామని మంత్రి జార్జ్ వివరించారు.






