- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగుబాటు
మావోయిస్టు పార్టీ(Maoist Party) అగ్రనేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్(Mallujola Venugopal) అలియాస్ సోనూ అలియాస్ భూపతి మహారాష్ట్ర పోలీసుల(Maharashtra Police) ఎదుట లొంగిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ(Maoist Party) అగ్రనేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్(Mallujola Venugopal) అలియాస్ సోనూ అలియాస్ భూపతి మహారాష్ట్ర పోలీసుల(Maharashtra Police) ఎదుట బుధవారం ఉదయం లొంగిపోయారు. గడ్చిరోలిలో లొంగుబాటు సభ ఏర్పాటు చేసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. ఆయనతో పాటు మరో 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో కొందరు కీలక నేతలు ఉన్నారు. అయితే లొంగుబాటు కార్యక్రమంలా కాకుండా, ముందుగా అభయ్ నోటితో సాయుధ పోరాట విరమణ ప్రకటన చేయించారు. అనంతరం వీరంతా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మాట్లాడారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మావోయిజానికి చోటు లేదని అన్నారు. దేశాన్ని నక్సల్స్ ఫ్రీ భారత్‌గా నిర్మిస్తామని ప్రకటించారు. అయితే లొంగిపోయిన మావోయిస్టులకు భారత రాజ్యాంగం మరాఠీ ప్రతిని బహుకరించడం ఆసక్తిగా మారింది.
కాగా, మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావుపై 100కు పైగా కేసులు ఉన్నాయి. ఆయన మీద రూ.6 కోట్ల రివార్డు ఉంది. దాదాపు మూడు రాష్ట్రాల్లో మల్లోజుల మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. అలాంటి అగ్రనేత ఏకంగా 60మందితో లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు :






