Dharmasthala: ధర్మస్థల మిస్టరీ కేసులో కీలక మలుపు.. బయటపడ్డ తొలి ఆధారం

by Prasad Jukanti |

కలకలం రేపిన కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థల మరణాల మిస్టరీలో కీలక పరిణాం చోటు చేసుకుంది.

Dharmasthala: ధర్మస్థల మిస్టరీ కేసులో కీలక మలుపు.. బయటపడ్డ తొలి ఆధారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తీవ్ర కలకలం రేపిన కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థల మరణాల మిస్టరీ కేసులో (Dharmasthala mass burial case) కీలక పరిణాం చోటు చేసుకుంది. ఈ కేసులు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు (SIT investigation Dharmasthala) తొలి ఆధారం లభించింది. ఫిర్యాదు దారుడైన పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతుండగా ఇవాళ ఓ చోట మానవ అవశేషాలను (Human remains found) గుర్తించారు. ఇప్పటి వరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడంతో కేసు దర్యాప్తులో ఉత్కంఠ పెరిగింది. కాగా 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైనవారివేనని గతంలో ఈ క్షేత్రంలో పని చేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తానే ఆ శవాలను పూడ్చి పెట్టానని వివరించాడు. అతడి ఫిర్యాదుతో అందరు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు.దీంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. గత సోమవారం నుంచి సిట్ అధికారులు అతడిని వెంట తీసుకువెళ్లి అతడు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఓ చోట తవ్వకం జరుపగా మానవ అవశేషాలు బయటపడ్డాయి. వాటిని ఫొరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ లో పరీక్షించాక అక్కడ వచ్చే రిపోర్టు ఆధారంగా అవి ఎవరివి అనే వివరాలు బయటకు తెలియనుంది.

Next Story