ఎన్నికల వేళ తమిళనాడులో కీలక పరిణామం.. BJP స్టేట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఖుష్బూ నియామకం

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-30 12:32:24  IST  )

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల వేళ తమిళనాడులో కీలక పరిణామం.. BJP స్టేట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఖుష్బూ నియామకం
X

దిశ, వెబ్‌డెస్క్: పొరుగు రాష్ట్రం తమిళనాడు (Tamilnadu)లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ (BJP) అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ప్రముఖ సినీనటి ఖుష్బూ సుందర్ (Khushboo Sunder)నియమితులయ్యారు. ఆమె నియామకానికి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఆమోదం తెలపడంతో అధికారిక ప్రకటన వెలువడింది. కుష్బూ సుందర్ 2020 అక్టోబర్ 12న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారు. ఆమె గతంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా పని చేసిన విషయం తెలిసిందే.




Next Story