- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగా సరెండర్ వేళ కీలక పరిణామం.. ఉదంతి ప్రాంత కమిటీ సంచలన లేఖ
గడ్చిరోలి, జగ్దల్‌పూర్ మావోయిస్టు పార్టీ అగ్రనేతల మెగా సరెండర్ వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: గడ్చిరోలి, జగ్దల్‌పూర్ మావోయిస్టు పార్టీ అగ్రనేతల మెగా సరెండర్ వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు గరియాబంద్ (Gariyaband) జిల్లాలోని మావోయిస్టు పార్టీ ఉదంతి ప్రాంత కమిటీ (Udanti Area Committee) శనివారం ఆయుధాలు విడిచిపెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఓ సంచలన లేఖను విడుదల చేసింది. అయితే, ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా (SP Nikhil Rakhecha) వారి నిర్ణయాన్ని స్వాగతించారు. ఉదంతి ప్రాంత కమిటీ రాసిన లేఖను పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు.
హింసాత్మక మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరాలనే మావోయిస్టు నిర్ణయాన్ని తాము పూర్తిగా స్వాగతిస్తున్నానని అందుకు వీలైనంత త్వరగా సానుకూలంగా చొరవ తీసుకుంటానని పేర్కొ్న్నారు. గరియాబంద్ ప్రాంతంలో చురుకుగా ఉన్న అనేక మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి తిరిగి రావాలని పోలీసులు నిరంతరం మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా గోబ్రా (Gobra), సీతానది (Seetha Nadi), శక్తి-సారన్‌గఢ్-రాయ్‌గఢ్ ప్రాంతాల్లో యాక్టివ్‌గా చురుకుగా మావోయిస్టులు వీలైనంత త్వరగా లొంగిపోవాలని కోరారు. సరెండర్ అవ్వాలనుకునే వారు ఎలాంటి సంకోచం లేకుండా నేరుగా తమను సంప్రదింవచ్చని.. ముందుగా లొంగిపోయే వారికి పోలీసులే పూర్తి బాధ్యత వహిస్తారని ఎస్పీ నిఖిల్ రఖేచా భరోసానిచ్చారు.






