మావోయిస్టుల ఐఈడీల ఉచ్చు.. ఛత్తీస్‍గఢ్‍లో భద్రతా దళాలకు తప్పిన భారీ ముప్పు

by Prasad Jukanti |

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు మావోయిస్టుల స్మారక స్తూపాలను కూల్చివేసి, నాలుగు శక్తివంతమైన ఐఈడీలను నిర్వీర్యం చేశాయి.

మావోయిస్టుల ఐఈడీల  ఉచ్చు.. ఛత్తీస్‍గఢ్‍లో భద్రతా దళాలకు తప్పిన భారీ ముప్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మార్చి 31 లోపు మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‍కు డెడ్‍లైన్ దగ్గర పడుతున్న వేళ భద్రతా దళాలు స్పీడు పెంచుతున్నాయి. ఓ వైపు మావోయిస్టుల లొంగుబాట్లు, ఎన్‍కౌంటర్లపై దృష్టి సారించిన భద్రతాదళాలు మరోవైపు మావోయిస్టుల స్మారక స్తూపాలు ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా ఛత్తీస్‍గఢ్ లోని కాంకేర్ జిల్లాలో భద్రతా దళాలు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. కాంకేర్ జిల్లా హపాతోలా, బింగుడ మారుమూల అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు సంయుక్తంగా నిర్వహించిన గాలింపు చర్యల్లో మావోయిస్టు స్మారక స్తూపాలను కూల్చివేశాయి.

నాలుగు ఐఈడీలు నిర్వీర్యం:

అయితే ఈ సెర్చ్ ఆపరేషన్‍లో భాగంగా చెట్లు, మధ్యల మధ్య మావోయిస్టులు అమర్చిన నాలుగు శక్తివంతమైన ఐఈడీ బాంబులు దళాలు గుర్తించాయి. వెంటనే అలర్ట్ అయిన బలగాలు వాటిని సురక్షితంగా నిర్వీర్యం చేశాయి. దీంతో భద్రతా సిబ్బందికి భారీ ప్రమాదం తప్పింది. ఈ ఆపరేషన్ లో భాగంగా మావోయిస్టులకు సంబంధించిన నిత్యావసర వస్తువులు, మందులు, మావోయిస్టు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సెర్చ్ పట్ల కాంకకేర్ పోలీసులు స్పందిస్తూ ఇది అతి పెద్ద విజయంగా అభివర్ణించారు. బస్తర్ డివిజన్ వ్యాప్తంగా ప్రస్తుతం తీవ్రవాద వ్యతిరేక పోరాటం ఉద్ధృతంగా సాగుతోందని తెలిపారు.

Next Story