షారూఖ్, దీపికాకు భారీ ఊరట.. ముందస్తు బెయిల్‌ మంజూరు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-11 04:59:36  IST  )

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ (Sharukh Khan), స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone)లకు భారీ ఊరట లభించింది.

షారూఖ్, దీపికాకు భారీ ఊరట.. ముందస్తు బెయిల్‌ మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ (Sharukh Khan), స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone)లకు భారీ ఊరట లభించింది. సెక్యూరిటీ ఫీచర్స్ లేని ఓ కారు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తురంటూ నమోదైన కేసులో రాజస్థాన్ హైకోర్టు (Rajas‌tan High Court) వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్ ప్రాంతానికి చెందిన అడ్వొకేట్ కీర్తి సింగ్ (Keerthi Singh) హ్యూందాయ్ కారును కొనుగోలు చేశారు. అయితే, కొన్న కారులో చాలా డిఫెక్ట్స్ ఉన్నాయని, తాను బ్రాండ్ అంబాసిడర్లను చూసే కారును కొనుగోలు చేశానని, తనకు న్యాయం చేయాలంటూ కీర్తి సింగ్.. షారూఖ్ ఖాన్, దీపికా పడుకొణెతో మరో ఆరుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదైంది. తాజాగా, బాధితురాలు ఇటీవలే రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.

సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్(Kapil Sibal) షారూఖ్ ఖాన్ తరఫున వాదిస్తూ.. తన క్లయింట్ షారూఖ్ ఖాన్‌కు ఈ కేసుతో నేరుగా ఏమాత్రం సంబంధం లేదని వాదించారు. పటిషనర్ ఆరోపించిన డిఫెక్టులకు అతడు బాధ్యత వహించలేడని తెలిపారు. ఎండార్స్‌మెంట్స్ తయారీ ప్రమాణాలకు బాధ్యతను సూచించవని ఆయన కోర్టుకు విన్నివించారు. అదేవిధంగా దీపికా పదుకొణె తరపున అడ్వొకేట్ మాధవ్ మిత్రా (Madhav Mithra) కూడా ఇవే విషయాలను ధర్మాసనం దృష్టి తీసుకెళ్లారు. తన క్లయింట్ దీపికా పదుకొణె‌కు కార్ల ఉత్పత్తి, నాణ్యత నియంత్రణలో ఎటువంటి పాత్ర లేదని పేర్కొన్నారు. అడ్వొకేట్ కీర్తి సింగ్ చేస్తున్న ఆరోపణలు షారుఖ్ ఖాన్, దీపికా ఎండార్స్‌మెంట్లు, వినియోగదారులను పూర్తి తప్పుదారి పట్టించేలా ఉన్నాయని కామెంట్ చేశారు. ఇరు పక్షాల వాదనలువిన్న రాస్థాన్ హైకోర్టు ధర్మాసనం షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణెతో పాటు మరో ఆరుగురిపై నమోదైన ఎఫ్ఐఆర్‌పై స్టే విధించింది. కేసులో వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా తీర్పును వెలువరించింది. కేసులో తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది.

Next Story