- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర రాజధాని నగరంలో పట్టపగలే భారీ ఎన్‌కౌంటర్
బిహార్ రాజధాని పాట్నాలో మంగళవారం భీకర ఎన్‌కౌంటర్ కలకలం సృష్టించింది.

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ రాజధాని పాట్నాలో మంగళవారం భీకర కాల్పులు కలకలం సృష్టించాయి. రామ్ లఖన్ పథ్‌లోని నివాస ప్రాంతంలో పోలీసులు, నలుగురు గ్యాంగ్‌స్టర్లకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఘటన తీవ్రతను గమనించిన వెంటనే నాలుగు పోలీస్ స్టేషన్ల పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించటంతో ఓ ఇంట్లోకి చోరబడ్డారు. దీంతో ఆ ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి పోలీసు బలగాలు చుట్టుముట్టాయి.
నేరస్థులను లొంగిపోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నేరస్తులు ప్రవేశించిన ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కాల్పులు ఎవరు లక్ష్యంగా చేసుకున్నారనే దానిపై ఇంకా నిర్ధారణ లేదు. నేరస్తులు తప్పించుకోకుండా ప్రతి బుల్లెట్ పాయింట్ వద్ద పోలీసులు మోహరిస్తున్నారు. పోలీసు బృందం మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టింది. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






