- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు పాలిటిక్స్‌లో చారిత్రాత్మక ఘట్టం: 59 ఏళ్ల తర్వాత కేబినెట్‌లోకి కాంగ్రెస్
తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకోబోతోంది. దాదాపు 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కేబినెట్‌లో చేరబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకోబోతోంది. దాదాపు 59 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ప్రభుత్వ మంత్రివర్గంలో (Cabinet) భాగస్వామి కాబోతోంది. తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్, సీఎం విజయ్ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్వకేట్ రాజేష్ కుమార్, పి.విశ్వనాథన్‌లను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇవాళ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు.
అయితే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (DMK)తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. అయితే, ఈ ఎన్నికల్లో ఒకే ఒక్క టర్మ్ పూర్తి చేసుకున్న డీఎంకే ఘోర పరాజయం పాలైంది. ఫిబ్రవరి 2024 లో నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) అత్యధిక స్థానాలు సాధించి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, 234 స్థానాలున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీకి టీవీకేకు 10 సీట్లు తగ్గాయి. మెజారిటీ కోసం సీఎం విజయ్ కాంగ్రెస్ మద్దతు కోరారు. అయితే కూటమిలో ఎలాంటి ‘మతతత్వ శక్తులు’ ఉండకూడదనే షరతుపై కాంగ్రెస్ విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించింది. తమిళనాడును 1967 నుంచి డీఎంకే, ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీలే మారుమార్పులుగా పాలిస్తూ వచ్చాయి. అయితే ఈ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా తమతో పొత్తులో ఉన్న మిత్రపక్షాలకు ఎన్నడూ ప్రభుత్వంలో గానీ, మంత్రివర్గంలో గానీ చోటు కల్పించలేదు. ఇప్పుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం మిత్రపక్షాలను కేబినెట్‌లోకి చేర్చుకోవడంతో 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ తమిళనాడు కేబినెట్‌లో అడుగుపెడుతోంది.






