రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ పలకరింపు.. పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర దృశ్యం!

by Ramesh Naini |

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ.. రాజకీయ ఉద్రిక్తతలను పక్కనబెట్టేలా ఒక అరుదైన, ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.

రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ పలకరింపు.. పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర దృశ్యం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ.. రాజకీయ ఉద్రిక్తతలను పక్కనబెట్టేలా ఒక అరుదైన, ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలడం సహజమే అయినా, గురువారం పార్లమెంట్ ఆవరణలో మాత్రం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల మధ్య జరిగిన కలయిక అందరి దృష్టిని ఆకర్షించింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ, నితిన్ గడ్కరీ అనుకోకుండా ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆత్మీయంగా పలకరించుకున్నారు. రాజకీయ విమర్శలను పక్కనపెట్టి, కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే, వారి మధ్య సాగిన సంభాషణలో ఏ అంశం ప్రస్తావనకు వచ్చిందనే దానిపై స్పష్టత లేదు. కానీ, బడ్జెట్ సమావేశాల గంభీర వాతావరణంలో.. అధికార పక్షానికి చెందిన సీనియర్ మంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత నవ్వుతూ మాట్లాడుకోవడం మాత్రం నెటిజన్లను, రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ‘రాజకీయం వేరు.. వ్యక్తిగత సంబంధాలు వేరు’ అని చాటిచెప్పేలా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.

Next Story