నా జీతం కట్ చేస్తావా? బ్యాంకు మేనేజర్‍ను కాల్చి చంపిన గార్డు

by Prasad Jukanti |   (  Updated:2026-03-17 07:29:24  IST  )

సెలవు ఇవ్వకపోగా జీతం కట్ చేశాడనే కోపంతో ఓ సెక్యూరిటీ గార్డు బ్యాంక్ మేనేజర్‍ను తుపాకీతో కాల్చి చంపాడు.

నా జీతం కట్ చేస్తావా? బ్యాంకు మేనేజర్‍ను కాల్చి చంపిన గార్డు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సెలవు తీసుకున్నందుకు తన జీతం డబ్బులు కట్ చేశారని బ్యాంకు మేనేజర్‍ను ఓ గార్డు కాల్చి చంపేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‍ గాజియాబాద్‍లోని (Ghaziabad) చోటు చేసుకుంంది. బలరామ్ నగర్ కాలనీలో ఉన్న పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ (Punjab and Sind Bank) బ్రాంచ్‌ కు మేనేజర్‍గా అభిషేక్ కుమార్ (36) 2025 వచ్చారు. ఆయన అదే ప్రాంతంలో తన భార్యతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే ఈ బ్రాంచ్‍లో రెండున్నర నెలల క్రితం రవీంద్ర హుడా (45) గార్డుగా చేరాడు. ఈ క్రమంలో సెలవుల విషయంలో హుడాకు బ్యాంకు మేనేజర్ కు మధ్య వాగ్వాదం జరిగింది.

కోపంతో రగిలిపోయిన హుడా:

ఇటీవల రవీంద్ర హుడాకు సెలవు అవసరం పడింది. ఈ విషయాన్ని మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లగా ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. తనకు సెలవు మంజూరు చేయకపోగా సెలవు తీసుకున్న తన జీతం నుంచి కోత విధించాడనే కోపంతో రగిలిపోయిన హుడా మేనేజర్ అభిషేక్ విషయంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. సోమవారం బ్యాంకులో తన క్యాబిన్‍లో ఉన్న మేనేజర్ అభిషేక్ వద్దకు వెళ్లి కోపంతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గాయపడిన మేనేజర్‍ను సిబ్బంది హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గార్డు హుడాతో పాటు ఆయన మిత్రుడు శిశుపాల్‍ను పోలీసులు అరెస్టు చేశారు. హుడాపై బీఎన్ఎస్ సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేశారు. అతడి వద్ద నుంచి డబుల్ బ్యారెల్ తుపాకీ, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Next Story