గవర్నర్ ను ఘోరంగా అవమానించిన విద్యార్థిని

by Muthe.Rajitha |

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi)కి ఘోర అవమానం(Insult) జరిగింది.

గవర్నర్ ను ఘోరంగా అవమానించిన విద్యార్థిని
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi)కి ఘోర అవమానం(Insult) జరిగింది. గవర్నర్ చేతుల మీదుగా పట్టా తీసుకోవడానికి ఓ విద్యార్థిని నిరాకరించింది. బుధవారం తమిళనాడులోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయంలో 32వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా పీహెచ్డీ పట్టాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో నాగర్‌కోయిల్‌కు చెందిన శ్రీమతి జీన్ జోసెఫ్ అనే విద్యార్థిని తన పీహెచ్డీ పట్టాను గవర్నర్ చేతుల మీదుగా అందుకోవడానికి నిరాకరించింది.

పక్కనే ఉన్న వర్శిటీ వైస్ ఛాన్సలర్ ఎన్. చంద్రశేఖర్ నుండి డిగ్రీని అందుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గవర్నర్ చేతుల మీదుగా డిగ్రీ తీసుకోవాలని వీసీ సూచిస్తున్నప్పటికీ విద్యార్థిని కనీసం అటువైపు తిరిగి కూడా చూడకపోవడం వీడియోలో కనిపిస్తోంది. పట్టా అందుకున్న అనంతరం వెనక్కి తిరిగి కూడా చూడకుణ్డా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే కార్యక్రమం అనంతరం జీన్ జోసెఫ్ ఈ ఘటనపై వివరణ ఇస్తూ.. గవర్నర్ తమిళనాడుకు, తమిళులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నందున, నేను అతని నుండి డిగ్రీని స్వీకరించాలనుకోలేదన్నారు.

అందుకు బదులుగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నుండి పీహెచ్డీ డిగ్రీని పొందానని చెప్పుకొచ్చింది. అయితే జీన్ చేసిన పనికి తమిళ ప్రజలు తమిళులు ఆత్మగౌరవంతో బతుకుతారని మరోసారి నిరూపించింది అని ఆమెను కొనియాడుతున్నారు. 

Next Story