Ganesh Chaturthi: గ్రౌండ్‌‌లో భారీ గణేశుడి ఆకృతిలో విద్యార్థులు.. 5 వేల దీపాలు, 4 వేల మందితో ప్రదర్శన

by Ramesh Naini |   (  Updated:2025-08-26 07:53:15  IST  )

ర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి తాళ్లలోని శ్రీరామనగరం విద్యానికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వినాయక చవితిని విభిన్న రీతిలో జరుపుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.

Ganesh Chaturthi: గ్రౌండ్‌‌లో భారీ గణేశుడి ఆకృతిలో విద్యార్థులు.. 5 వేల దీపాలు, 4 వేల మందితో ప్రదర్శన
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో వినాయక చవితి (Ganesh Chaturthi) సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి తాళ్లలోని శ్రీరామనగరం విద్యానికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు (Vinayaka Chavithi) వినాయక చవితిని విభిన్న రీతిలో జరుపుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. పాఠశాలలో చదువుతున్న నాలుగు వేల మంది విద్యార్థులు (Students) భారీ గణేశుడి ఆకృతిని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. గ్రౌండ్‌లో వినాయకుడి ఆకారంలో స్కేచ్ వేసి వాటిపై ఐదు వేల దీపాలను వెలిగించి అద్భుత ప్రదర్శనను నిర్వహించారు. ఈ దృశ్యాన్ని దాదాపు ఐదు వందల మీటర్ల ఎత్తు నుంచి డ్రోన్ కెమెరా ద్వారా షూట్ చేశారు. సాయంత్రం సమయంలో దీపాల వెలుగుల్లో గణేశుని రూపం చూస్తూ విద్యార్థులు సంబరాలు చేశారు. దీనిపై విద్యా సంస్థ ప్రెసిడెంట్ నెక్కంటి సూరిబాబు మాట్లాడుతూ.. వేల మంది విద్యార్థులు, ఐదు వేల దీపాలతో భారీ పరిమాణంలో గణేశ్‌ను రూపోందించి పండుగను స్వాగతించామని అన్నారు. పూర్వ, ప్రస్తుత విద్యార్థులతో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించినట్లు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణేశుని పూజించాలని దీని ద్వారా సంకేతం ఇచ్చినట్లు తెలిపారు. కాగా, భారీ గణేశుడి ఆకృతిలో విద్యార్థుల ప్రదర్శన డ్రోన్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story