- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యవసాయ బోరుబావిలో పడిన ఐదేళ్ల బాలుడు.. పైపుతో ఆక్సిజన్ సరఫరా
by Yella Dhawani Reddy |
పొలం వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో (Borewell) పడిపోయిన ఐదేళ్ల బాలుడిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: పొలం వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో (Borewell) పడిపోయిన ఐదేళ్ల బాలుడిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాజస్థాన్ రాష్ట్ర ఝలావర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
జిల్లాకు చెందిన ప్రహ్లాద్ అనే ఐదేళ్ల బాలుడు వ్యవసాయ పొలంలో ఆడుకుంటూ 32 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న NDRF, SDRF, బలగాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. బాలుడి కోసం వైద్య బృందం పైపు ద్వారా ఆక్సిజన్ పంపిస్తున్నారు. దీంతో సమయం గడుస్తున్న కొద్దీ బాలుడి పరిస్థితిపై ఆందోళన మరింతగా పెరుగుతోంది. ప్రహ్లాద్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడాలని కుటుంబసభ్యులతో పాటు బంధువులు, స్థానికులు ప్రార్థిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






