Eiffel Tower : ఈఫిల్ టవర్లో మోగిన ఫైర్ అలారం

by Muthe.Rajitha |

ప్రఖ్యాత ఈఫిల్ టవర్లో(Eiffel Tower) ఫైర్ అలారం(Fire Alaram) మోగడం కలకలం రేపింది.

Eiffel Tower : ఈఫిల్ టవర్లో మోగిన ఫైర్ అలారం
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రఖ్యాత ఈఫిల్ టవర్లో(Eiffel Tower) ఫైర్ అలారం(Fire Alaram) మోగడం కలకలం రేపింది. మంగళవారం ఎలివేటర్లో షార్ట్ సర్క్యూట్ వలన ఒక్కసారిగా ఫైర్ అలారం మోగడంతో, ఈఫిల్ టవర్లో అగ్ని ప్రమాదంగా భావించి సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. పర్యాటకులను ఆ ప్రదేశం నుంచి వేరే చోటికి తరలించారు. ప్రమాద కారణాన్ని గుర్తించిన నిర్వహకులు, పెద్దగా భయపడాల్సిన పనేం లేదని ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కు గల కారణాలపై విచారణ చేస్తున్నామని, ప్రస్తుతానికి టవర్లోని రెండో అంతస్తుకు ఎవరినీ అనుమతించడం లేదు. కాగా ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదు. అయితే ఈ వ్యవహారంపై ఫ్రాన్స్ పోలీసులు ఎలాంటి ప్రకటన చేయక పోవడం గమనార్హం.

Next Story