- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Boat Capsizes : కుంభమేళా వేళ.. గంగా నదిలో ఘోర ప్రమాదం
ఓ వైపు మహా కుంభమేళా(Maha Kumbhamela) జరుగుతుంటే... గంగానది(Ganga River)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఓ వైపు మహా కుంభమేళా(Maha Kumbhamela) జరుగుతుంటే... గంగానది(Ganga River)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గంగానదిలో ఆదివారం పడవ బోల్తా(Boat Capsizes) పడిన ఘటనలో ముగ్గురు మరణించగా.. మరో నలుగురు గల్లంతయ్యారు. రెస్క్యూ బృందాలు గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటన బీహార్(Bihar)లోని కతిహార్ జిల్లాలో జరిగింది. ఆదివారం 17 మందితో కూడిన పడవ అమ్దాబాద్ ప్రాంతంలోని గోలాఘాట్ సమీపంలో గంగా నదిలో బోల్తా పడి మునిగింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. నదిలో పడిన పది మందిని రక్షించారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. మరో నలుగురు గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. పడవలో ఎక్కువ మంది ప్రయాణించడం వల్లనే బోల్తా పడి మునిగి ఉంటుందని, ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ మనేష్ కుమార్ మీనా వెల్లడించారు.






