- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీవ్ర విషాదం.. కాళ్ల పారాణి ఆరనే లేదు.. అంతలోనే అనంతలోకాలకు నవ జంట
పెళ్లి(marriage) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ గొప్ప మలుపు.

దిశ,వెబ్డెస్క్: పెళ్లి(marriage) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ గొప్ప మలుపు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడే మధురమైన వేడుక వివాహం. పెళ్లి అంటేనే ఇద్దరి వ్యక్తుల మనసులకు సంబంధించినది. ఎందుకంటే ఇద్దరూ ఇష్టంగా అంగీకరిస్తానే పెద్దలు వారికి వివాహం జరిపిస్తారు. ఈ క్రమంలో ఓ జంట ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. కానీ అంతలోనే ఆ ఆశలు ఆవిరయ్యాయి. రాష్ట్రంలో పెళ్లయిన కొద్ది గంటల్లోనే నవ జంట మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని అయోధ్య(Ayodya)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాళ్ల పారాణి తడి ఆరలేదు. మెడలో వేసిన పూల మాలలు వాడలేదు. పెళ్లై కొన్ని గంటలే అవుతోంది. ఎన్నో కలలతో కొత్త జీవితాన్ని పండించుకోవాల్సిన ఆ జంట గదిలో విగత జీవులుగా కనిపించారు. ఆ గదిలో భర్త ఉరివేసుకొని కనిపించారు. భార్య మంచం పై పడి ఉంది. కొత్తగా పెళ్లైన ఆ నవ వధూవరుల జీవితాలు అలా అర్ధాంతరంగా ముగిసిపోవడం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






