- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హనీమూన్‌కి వెళ్లిన జంట.. తిరిగొచ్చిందో మృతదేహం, మరొకరి జాడ మాయం!
పెళ్లి అయ్యి వారం రోజులే అయింది. కొత్త జీవితం.. కొత్త ప్రారంభం.. కోటి ఆశలతో, కలల కళ్లతో హనీమూన్‌కి వెళ్లారు.

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి అయ్యి వారం రోజులే అయింది. కొత్త జీవితం.. కొత్త ప్రారంభం.. కోటి ఆశలతో, కలల కళ్లతో హనీమూన్‌కి వెళ్లారు. ప్రతి క్షణాన్ని ఆనందంగా గడిపేయాలని, జీవితాన్ని అందంగా మలుచుకోవాలనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆ కలల ప్రయాణం ఒక్కసారిగా విషాదకథగా మారింది. ప్రేమ, పండుగ, హరివిల్లు చూపించాల్సిన ఆ యాత్ర.. కన్నీరు, శోకం, ప్రశ్నలే మిగిలేలా చేసింది. మేఘాలయలో మిస్సయిన హనీమూన్ జంట కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నవ వరుడి మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వ్యాపార కుటుంబం యువకుడు రాజ రఘువంశీ మే 11న సోనమ్‌ను వివాహం చేసుకున్నాడు. అనంతరం మే 20న ఆ జంట హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. అయితే మే 23న తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో ఈ జంట అదృశ్యమైంది. నాటి నుంచి మేఘాలయ పోలీసులు, రెస్క్యూ బృందాలు వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో జూన్ 2న (సోమవారం) రాజ రఘువంశీ మృతదేహాన్ని లోయలో గుర్తించినట్టు మేఘాలయ పోలీసులు తెలిపారు.
ఇండోర్ పోలీస్ అధికారి రాజేష్ కుమార్ త్రిపాఠి ప్రకారం.. రాజ సోదరుడు మృతదేహాన్ని గుర్తించినట్టు చెప్పారు. డెడ్ బాడీపై ఉన్న గాయాలను బట్టి హత్యగా భావిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అతని భార్య సోనమ్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు వివరించారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.






