- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Odisha Couple: ప్రేమ పెళ్లి చేసుకున్నారని నాగలికి ఎద్దుల్లా కట్టి గ్రామ పెద్దల దారుణం (వీడియో)
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై గ్రామ పెద్దల అమానుషంగా ప్రవర్తించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రేమ వివాహం చేసుకున్న జంట పట్ల గ్రామస్తులు అమానుషంగా ప్రవర్తించారు. గ్రామ కట్లుబాట్లు మీరారని ఆ జంటను నాగలికి ఎద్దుల్లా కట్టి చిత్రహింసలకు గురి చేశారు. ఈ పైశాచిక ఘటన ఒడిశాలో జరిగగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాయగడ జిల్లా కంజమజ్హిరా గ్రామానికి చెందిన ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. అయితే ఈ జంట ఇద్దరూ బంధువులే అయినప్పటికీ గ్రామ ఆచారాలకు విరుద్ధంగా వీరి నిర్ణయం ఉందని గ్రామ పెద్దలు అభ్యంతరం తెలిపారు. దీంతో వారిని శిక్షించే ఉద్దేశంతో పొలం వద్దకు తీసుకువెళ్లి నాగలి కాడిని ఆ యువతి, యువకుడి భుజాలపై ఉంచి పొలాన్ని దున్నించారు. కర్రలతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా పాపపరిహాం అంటూ గుడివద్దకు తీసుకువెళ్లి అక్కడ వారిని హింసించారు.
ఈ అమానుష ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఒడిసా ప్రభుత్వాన్ని, పోలీసులను నెటిజన్లు కోరుతున్నారు. ఇద్దరు మేజర్లే అయితే వారి నిర్ణయాలను గౌరవించాలని గ్రామ పెద్దల పేరుతో ఈ తరహా శిక్షలు విధించడం ఏంటని మండిపడుతున్నారు. మోరల్ పోలిసింగ్ పేరుతో ఈతరహా ఘటనలు పెరిగిపోతున్నాయిని వీటి విషయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






