- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెట్రోల్ బంక్‌లో పనిచేసే మహిళపై దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్
గుజరాత్‌లోని (Gujarat) సూరత్ జిల్లాలోని (Surat) షాకింగ్ ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్‌లోని (Gujarat) సూరత్ జిల్లాలోని (Surat) షాకింగ్ ప్రమాదం చోటుచేసుకుంది. పాలోద్ ప్రాంతంలో ముంబై-అహ్మదాబాద్ రోడ్డుపై ఉన్న ఓ పెట్రోలు బంక్ వద్ద మంగళవారం పారిశుధ్ధ్య పనులు చేస్తున్న మహిళపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడగా, అక్కడున్న సీసీటీవీలో ఈ మొత్తం దృశ్యాలు రికార్డ్ కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసుల వివరాల ప్రకారం, 35 ఏళ్ల సంగీతాబెన్ ఠాకోర్ అనే మహిళ పెట్రోలు బంక్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తుంది.
మంగళవారం ఉదయం ఓ క్రెటా మోడల్ కారు పెట్రోలు నింపించేందుకు బంక్‌కు వచ్చింది. పెట్రోలు నింపిన అనంతరం డ్రైవర్ కారును ముందుకు నడిపే క్రమంలో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు నేరుగా పక్కనే చెత్త శుభ్రం చేస్తున్న సంగీతాబెన్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం తర్వాత కారులో ఉన్న డ్రైవర్ అక్కడి నుంచి కారుతో పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన సంగీతాబెన్ అక్కడే నేలపై విలవిలలాడుతూ పడిపోయింది. అక్కడి సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనపై కోసంబా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






