అయోధ్యలో కొరియన్ రాణి హియో హ్వాంగ్-ఒక్ కాంస్య విగ్రహాం

by Ajay Maddhiboyina |

కొరియన్ రాణి హియో హ్వాంగ్ ఒక్ కాంస్య విగ్రహాన్ని అయోధ్యలో స్థాపించారు. ఇండో కొరియ‌న్ చారిత్ర‌క సంబంధానికి గుర్తుగా ఈ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు.

అయోధ్యలో కొరియన్ రాణి హియో హ్వాంగ్-ఒక్ కాంస్య విగ్రహాం
X

దిశ‌, వెబ్ డెస్క్: కొరియన్ రాణి హియో హ్వాంగ్ ఒక్ కాంస్య విగ్రహాన్ని అయోధ్యలో స్థాపించారు. ఇండో కొరియ‌న్ చారిత్ర‌క సంబంధానికి గుర్తుగా ఈ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి హియో హ్వాంగ్ ఒక్ అయోధ్యలోనే జన్మించగా అప్పట్లో ఆమెను ఆమెను సురిరత్న రాజకుమారి అని పిలిచేశారు. క్రీ.శ 48లో సముద్రమార్గంలో కొరియాకు వెళ్లి గయా రాజ్య స్థాపకుడు అయిన రాజు సురోను వివాహం చేసుకున్నారు. హియో భారతీయ సంస్కృతి మ‌రియు బౌద్ధ ధ‌ర్మాన్ని కొరియాకు ప‌రిచ‌యం చేశారు. అయితే నేటికీ కొరియాలోని కరక్ వంశానికి చెందిన లక్షలాది మంది ఆమెను తమ పూర్వజన్మగా విశ్వసిస్తున్నారు. అంటే కిమ్ అనే పేరు ఉన్న కొరియన్లు అంతా హియో వారసులే అని చెప్పుకుంటారు. అంతే కాకుండా ప్రతి ఏడాది అనేకమంది కొరియన్ దేశస్తులు అయోధ్యను తమ మాతృభూమిగా భావిస్తూ వ‌చ్చి వెళుతుంటారు.

Next Story