దుమారం రేపుతున్న మిస్ యూనివర్స్ పోటీల్లో గొడవ

by Muthe.Rajitha |

థాయ్‌లాండ్‌ లో జరుగుతున్న 74వ విశ్వసుందరి (Miss Universe) పోటీల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది.

దుమారం రేపుతున్న మిస్ యూనివర్స్ పోటీల్లో గొడవ
X

దిశ, వెబ్ డెస్క్ : థాయ్‌లాండ్‌ లో జరుగుతున్న 74వ విశ్వసుందరి (Miss Universe) పోటీల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆతిధ్య దేశానికి ఓ కంటెస్టెంట్ కి మధ్య జరిగిన గొడవ తీవ్ర దుమారం రేవుతోంది. కంటెస్టెంట్స్ ను తిట్టడం అవమానంగా ఫీలయ్యి... అందాల భామలు అంతా వేదిక నుంచి బాయ్ కాట్ చేసి బయటికి వచ్చారు. చివరికి అంతా బహిరంగ క్షమాపణలు చెప్పుకున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. మిస్‌ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న మిస్ మెక్సికో ఫాతిమా బోష్ ఒక షూట్‌కు హాజరుకాలేదు. మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ నేషనల్ డైరెక్టర్, మిస్‌ యూనివర్స్ ఆర్గనైజేషన్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాత్‌.. ఆమె గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బుర్ర తక్కువ వ్యక్తులు అనే అర్థం వచ్చేలా తిట్టాడు. దీంతో ఫాతిమా ఫైర్ అయ్యారు. గౌరవం అనేది ఇచ్చుపుచ్చుకోవాలి. మాకు ఎంత గౌరవం ఇస్తే మీకు కూడా అంతే దక్కుతుంది అని మండిపడింది. ఆ విధంగా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.

అనంతరం ఫాతిమాతోపాటు మరికొన్ని దేశాలకు చెందిన కంటెస్టెంట్‌లు వేదిక నుంచి వాకౌట్ చేశారు. ఈ వ్యవహారం ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ అయింది. నవాత్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తం రావడంతో దిగివచ్చి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. దీనిపై మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ కూడా స్పందించి, క్షమాపణలు కోరడమే కాదు.. ఈ ఘటనను ఖండిస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

Next Story