10 ఏళ్లకే 10వ తరగతి పాసైన బాలుడు

by Malleboina Mahesh |

యూపీకి చెందిన 10 ఏళ్ల బాలుడు.. 10వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించాడు.

10 ఏళ్లకే 10వ తరగతి పాసైన బాలుడు
X

దిశ, వెబ్‌డెస్క్: యూపీకి చెందిన 10 ఏళ్ల బాలుడు.. 10వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించాడు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అతి పిన్న వయస్కుడైన విద్యార్థులలో అయాన్ గుప్తా 76.67% స్కోర్ చేశాడు. అలాగే గణితంలో 82, సైన్స్ లో 83 మార్కులు సాధించినట్లు సమాచారం. అలాగే చిన్న వయస్కుడైన అయాన్ 10వ తరగతి పరీక్షలు రాసేందుకు గాను.. పాఠశాల ప్రిన్సిపాల్ రాష్ట్ర బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. అలాగే ఎగ్జామ్స్ రాయడమే కాకుండా పాస్ అయి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.

Next Story