- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టైర్ పంక్చర్ చెక్ చేయించినందుకు రూ.8000 బిల్లు! అసలు విషయం తెలిస్తే షాకవుతారు!
పెట్రోల్ బంకుల్లో ఈసారి ఒక కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. దీని గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే.

దిశ, వెబ్ డెస్క్: పెట్రోల్ బంకుల్లో స్కామ్‌లు అనగానే.. సాధారణంగా చెల్లించిన డబ్బుకు తక్కువ పెట్రోల్ (Petrol) ఇవ్వడం గురించి మనం తరచూ వార్తల్లో చూస్తుంటాం. అయితే, ఈసారి ఒక కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. దీని గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే. పెట్రోల్ బంకుల్లో అందించే సేవల్లో టైర్లలో గాలి నింపడం ఒక సాధారణ సేవ కాగా, కొన్ని చోట్ల టైర్ పంక్చర్ రిపేర్ సేవలను కూడా అందిస్తారు. ఈ సేవలను ఉపయోగించుకునే వాహనదారులను లక్ష్యంగా చేసుకుని, కొందరు స్కామర్‌లు కొత్త రకం మోసాలకు (Scams) పాల్పడుతున్నారు. తాజాగా హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో (Gurugram) ఈ విధమైన ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే?
గురుగ్రామ్‌కు చెందిన ప్రణయ్ కపూర్ అనే వ్యక్తి కారులో వెళ్తుండగా.. కారు డాష్‌బోర్డ్‌లో టైర్ ఫ్లాట్ అయినట్లు సూచించే వార్నింగ్ లైట్ గమనించాడు. వెంటనే సమీపంలోని పెట్రోల్ బంకుకు వెళ్లాడు. అక్కడి టైరు పంక్చర్ షాప్ సిబ్బంది దాన్ని పరిశీలించి నిజంగా ఫ్లాట్ అయిందని నిర్ధారించారు. అయితే, టైర్‌ను పూర్తిగా తనిఖీ చేయడానికి తొలగించాలని ఆ సిబ్బంది చెప్పాడు. దీంతో సరేనని ప్రణయ్ చెప్పడంతో కారు నుంచి టైరును తొలగించి, సబ్బు నీళ్లతో చెక్ చేయగా, టైరులో ఒక స్క్రూ కనిపించింది. దాన్ని తొలిగించారు. కానీ తర్వాత మరో నాలుగు చోట్ల పంక్చర్లు ఉన్నాయని, ప్రతి పంక్చర్‌కు 'మష్రూమ్ పాచ్' అవసరమని, ఒక్కో ప్యాచ్‌కు రూ.300 చొప్పున, మొత్తం నాలుగు ప్యాచ్‌లకు రూ.1,200 అవుతుందని చెప్పారు.
ప్రణయ్‌కు అనుమానం రావటంతో అర్హత గల అసలు టైరు రిపేర్ షాపుకు వెళ్లాడు. అక్కడి టెక్నీషియన్ టైర్‌ను తనిఖీ చేసి, కేవలం ఒక్క పంక్చర్ మాత్రమే నిజమైనదని, మిగిలినవి కావాలని పెట్రోల్ బంకు వర్కర్ బిల్లు పెంచడానికి ఉద్దేశపూర్వకంగా సృష్టించినవని చెప్పటంతో విని షాకయ్యాడు. స్క్రూ తొలగించే సమయంలో వారు పదునైన పరికరం ఉపయోగించి ఇలా చేస్తారని చెప్పాడు. ఈ విషయాన్ని ప్రణయ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. పెట్రోల్ బంకు సిబ్బంది చేసిన మోసానికి తన కారు టైరును మార్చుకోవాల్సి వచ్చిందని, అందుకు రూ.8000 ఖర్చు అయిందని వివరించాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా కావటంతో పలువురు నెటిజన్లు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. 'నాకు కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడైనా తెలుసుకున్నాను. ఇప్పుడు వారి పక్కన కూర్చొని, వారు ఏ వస్తువులు చేతిలో పెట్టుకున్నారో గమనిస్తాను', 'ధన్యవాదాలు! నాకు ఇటీవలే ఇదే అనుభవం ఎదురైంది. ఇకపై జాగ్రత్తగా ఉంటాను' అంటూ కామెంట్లు పెడుతున్నారు.






