- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
A-10 Warthog: అమెరికాకు మరో ఎదురుదెబ్బ.. రెండో యుద్ధ విమానం కూల్చివేత!
పర్షియన్ గల్ఫ్‌లో అమెరికాకు ఊహించని షాక్ తగిలింది. ఇరాన్ దళాల దాడిలో అమెరికా వైమానిక దళానికి చెందిన రెండవ యుద్ధ విమానం (A-10 Warthog) కూలిపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: పర్షియన్ గల్ఫ్ రీజియన్‌లో అమెరికా (America), ఇరాన్ (Iran) దళాల మధ్య యుద్ధం జోరుగా కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే అమెరికాకు చెందిన రెండు శక్తిమంతమైన యుద్ధ విమానాలు కూలిపోవడం సంచలనం సృష్టిస్తోంది. తొలుత ఒక F-15E స్ట్రైక్ ఈగిల్ విమానం కూలిపోగా, తాజాగా A-10 వార్‌ట్యాగ్ (Warthog) అనే మరో దాడి విమానం కూడా పర్షియన్ గల్ఫ్ జలాల్లో పడిపోయినట్లుగా తెలుస్తోంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (Strait of Hormuz) సమీపంలో గాలింపు చర్యలు చేపడుతుండగా A-10 వార్‌ట్యాగ్ విమానం కూలిపోయింది. ఈ విమానంలోని పైలట్‌ను అమెరికా రెస్క్యూ టీమ్ సురక్షితంగా కాపాడగలిగింది. అంతకుముందు కూలిపోయిన F-15E విమానంలోని సిబ్బంది కోసం వెతుకుతున్న అమెరికాకు చెందిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై కూడా ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో హెలికాప్టర్లలోని సిబ్బందికి గాయాలైనట్లుగా సమాచారం.
అయితే, తమ గగనతలాన్ని అతిక్రమించినందుకే అమెరికా విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. తమ రక్షణ వ్యవస్థలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందిస్తూ.. ‘ఈ విమానాల కూల్చివేత సంఘటనలు ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చలపై ఎటువంటి ప్రభావం చూపబోవని కామెంట్ చేశారు. యుద్ధం కొనసాగుతున్నప్పటికీ దౌత్యపరమైన చర్చలకు తాము సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ స్పష్టం చేశారు.






