కర్ణాటక ఎన్నికల్లో 92 ఏళ్ల వృద్ధుడు రికార్డ్.. వరుసగా నాలుగోసారి విజయం

by Dishafeatures2 |
కర్ణాటక ఎన్నికల్లో 92 ఏళ్ల వృద్ధుడు రికార్డ్.. వరుసగా నాలుగోసారి విజయం
X

దిశ, డైనమిక్ బ్యూరో : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 92 ఏళ్ల వృద్ధుడు రికార్డు సృష్టించాడు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామనూరు శివశంకరప్ప వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి శివశంకరప్ప తాజా ఫలితాల్లో విజయం సాధించాడు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఓటమి ఎరుగని నాయకుడిగా నిలిచారు. శిశంకరప్ప 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించి.. దావణగెరె మున్సిపల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1997 లోక్ సభ ఎన్నికల్లోను విజయం సాధించారు. 2004లో దావణగెరె ఎమ్మెల్యేగా మరోసారి గెలుపొందారు. 2008, 2013, 2018 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు దావణగెరె దక్షిణ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాగా, తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి శివశంకరప్ప రికార్డు సృష్టించారు.

ఇవి కూడా చదవండి:

ఇది బలవంతులపై బలహీనుల విజయం.. రాహుల్ గాంధీ

Next Story

Most Viewed