స్కూల్లో ఆడుకుంటూ కుప్పకూలిన బాలిక.. నెలల వ్యవధిలో తీరని విషాదం

by Naga Rani Yarlagadda |

తన ఫ్రెండ్స్ తో స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటున్న 9 ఏళ్ల బాలిక కుప్పకూలింది. గుండెపోటుకారణంగా ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.

స్కూల్లో ఆడుకుంటూ కుప్పకూలిన బాలిక.. నెలల వ్యవధిలో తీరని విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా గుండెపోటు మరణాలు మళ్లీ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గురువారం ఉదయం చిత్తూరు జిల్లా పలమనేరులో బ్యాంక్ ఉద్యోగి జిమ్ లో వ్యాయామం అనంతరం అస్వస్థతకు గురై.. గుండెపోటుతో మరణించాడు. కాసేపటికే నెట్టింట విషాదకరమైన వీడియో వైరల్ అవుతూ కనిపించింది. స్కూల్ గ్రౌండ్ లో ఆడుకుంటున్న 9 ఏళ్ల బాలిక ఉన్నట్లుండి కుప్పకూలింది. గుండెపోటుకు గురై ఆ చిన్నారి మరణించింది. ఈ ఘటన రాజస్థాన్ లో జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది.

ప్రాథమిక వివరాల ప్రకారం.. రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లా గోటన్ కు చెందిన రాజేంద్ర బపేడియా కూతురు దివ్య (9) స్థానిక ఇంటర్నేషనల్ స్కూల్లో 5వ తరగతి చదువుతోంది. ఈనెల 23న రోజూలాగే స్కూల్ కు వెళ్లింది. ప్రేయర్ కు ఇంకా టైమ్ ఉండటంతో తన ఫ్రెండ్స్ తో కలిసి గ్రౌండ్లో ఆడుకుంటూ.. కుప్పకూలిపోయింది. వెంటనే స్కూల్ సిబ్బంది దివ్యను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె మరణించినట్లు ప్రకటించారు. గుండెపోటు కారణంగానే బాలిక మరణించి ఉంటుందని వైద్యులు భావించారు. కాగా.. కొన్నినెలల క్రితం దివ్య సోదరుడు అభిషేక్ కూడా ఇదేరీతిలో చనిపోయినట్లు సమాచారం. నెలల సమయంలో ఇద్దరు పిల్లలు మరణించడంతో ఆ కుటుంబం తీరని శోకసంద్రంలో మునిగిపోయింది.

Next Story