- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakistani Aircraft: ఆపరేషన్ సిందూర్.. నేలకూలిన 6 యుద్ధవిమానాలు
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు జరిగిన నష్టం గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు జరిగిన నష్టం గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. అయితే, ఆపరేషన్ సమయంలో పాక్ వైమానిక దళానికి చెందిన ఆరు యుద్ధ విమానాలు నేలకూలినట్లు మిలిటరీ వర్గాల నివేదికలో తేలింది. దీంతో పాటు రెండు హై వాల్యూ సర్వియలెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్, పది సాయుధ డ్రోన్లు, ఒకటి సీ-130 హెరిక్యూల్స్ ట్రాన్స్‌పోర్టు విమానం ధ్వంసమైనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ వైమానిక, సైనిక దళానికి భారీగా నష్టం జరిగినట్లు నివేదిక అంచనా వేసింది. పాకిస్థాన్‌లోని పంజాబ్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడుల్లో పాక్ కు చెందిన విమానాలు నేలకూలినట్లు రిపోర్టు ద్వారా తెలుస్తోంది. రాడార్ ట్రాకింగ్, థర్మల్ సిగ్నేచర్ ద్వారా పాక్ విమానాలు కూలిన విషయాన్ని ధ్రువీకరించినట్లు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. భారతీయ మిస్సైల్ వ్యవస్థలు ఆ సిగ్నల్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. పేల్చివేత తర్వాత పాక్ విమానాలకు చెందిన ట్రాకింగ్ సమాచారం లభ్యంకావట్లేదన్నారు. అంతేకాకుండా, హై వాల్యూ నిఘా ఎయిర్‌క్రాఫ్ట్ కూల్చివేత కీలకమైందని పేర్కొన్నారు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ వ్యవస్థను లాంగ్ రేంజ్ మిస్సైల్ సుదర్శన్‌తో చిత్తు చేసినట్లు చెప్పారు.
మరోవైపు, స్వీడన్ దేశానికి చెందిన ఎయిర్‌బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ ను కూల్చినట్లు నివేదిక పేర్కొంది. పాకిస్థాన్‌లోని బోలారి ఎయిర్‌బేస్‌లోని ఆ సిస్టమ్ ను ఎయిర్ టు సర్ఫేస్ క్రూయిజ్ మిస్సైల్ దాడి ద్వారా నాశనం చేశారు. ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్ హౌజింగ్ ధ్వంసానికి చెందిన శాటిలైట్ చిత్రాలను రిలీజ్ చేశారు. మరో ఆపరేషన్‌లో సీ-130 హెర్క్యూల్స్ విమానాన్ని కూల్చేశారు. పాకిస్తాన్ లోని పంజాబ్‌పై జరిగిన డ్రోన్ దాడిలో ఆ విమానం కూలింది. సీ-130ని లాజిస్టికల్ సపోర్టు కోసం వినియోగిస్తారు. ముల్తాన్ వద్ద ఆపరేట్ చేస్తున్న దాన్ని డ్రోన్ దాడితో కూల్చేశారు. రఫేల్, సుఖోయ్ 30 ద్వారా చైనాకు చెందిన వింగ్ లూంగ్ సిరీస్ డ్రోన్లను నేలకూల్చారు. సింగిల్ స్ట్రయిక్‌లో యూసీఏవీలను పేల్చినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్‌కు కౌంటర్‌గా ఆపరేషన్ బుయాన్ ఉన్ మార్సూస్‌ను పాకిస్థాన్ నిర్వహించింది. అయితే భారత్ అంచనా వేసిన దాని కన్నా అదనంగా మరో ఏడు ప్రాంతాల్లో పాక్‌కు నష్టం జరిగినట్లు ఆపరేషన్ బుయాన్ రిపోర్టు ద్వారా స్పష్టమైంది. పెషావర్, జాంగ్, హైదరాబాద్(సింధ్), గుజరాత్, బహవాల్‌నగర్, అటోక్,చోర్ ప్రాంతానలు కూడా ఇండియా టార్గెట్ చేసినట్లు రిపోర్టు ద్వారా వెల్లడైంది.






